అమృతోత్సవం ..!!> రావుల కిరణ్మయి>కవయిత్రి...> హన్మకొండ*: - చిత్రం : డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్

స్వాతంత్య్ర     భారతి కి 
అమృతోత్సవం
జైహిందే ,ఎదలయగా  
మోగుతున్నమహోత్సవం!
జయహే !జయ జయహే !!
నా తల్లి భారతి...
జయహే !జయజయహే !!
నా పుణ్యధరిత్రి.

భగవత్ప్రాసాదాలు 
అలరారే సంపదలు
తరిగిపోని చెరిగిపోని
చారిత్రక ఆనవాళ్లు!
భావితరాలకీయగ 
కట్టాలి కంకణాలు,
అమృతోత్సవపు వేళ 
పూనాలిక ప్రతినలు!

భిన్న భిన్న  కల్లోలిత 
అలజడి సంద్రాలన్నీ
హిమవత్పర్వతమంతటి 
శాంతి కొరకు  పోరాడి
శాంతినికేతనమయ్యి 
భరతావని నిలిచి పోగ
అమృతోత్సవపు వేళ 
పట్టాలిక దీక్షలు!

శ్రామికులై కర్షకులై 
ప్రతి ఒక్కరు శ్రమించి
పల్లకిమోతను విడిచి
బోయీలుగ మారి
భరత జాతి గౌరవాన్ని 
నింగికి ఎదిగించ
అమృతోత్సవపు వేళ 
రాయాలిక లక్ష్యాలు!!

కామెంట్‌లు