మహారాణా ప్రతాప్...అచ్యుతుని రాజ్యశ్రీ

 1540లోమేవాడ్ లో పుట్టిన  మహారాణాప్రతాప్ బాల్యంనించీ వీరాభిమన్యుడు.
 గొప్ప దేశభక్తుడు.ఆనాటి మొగల్ పాదుషా అక్బర్ చాలా చాకచక్యంగా భారతీయ రాజులని చాకచక్యంగా లొంగదీసుకుని తనరాజ్యాన్ని విస్తరించాడు.చరిత్రకు వక్రభాష్యంచెప్పినవారివల్ల మనం రాణా ప్రతాప్ ని దాదాపు మర్చిపోయాం.రాణా సింహాసనం ఎక్కాక సొంత తమ్ముడు శక్తిసింహుడు జగమల్ మొగలుల స్నేహంచేసి అన్నకి ద్రోహం తలపెట్టారు.తగినంత ధనం సైన్యం లేకున్నా ఆత్మాభిమానం ఉన్న రాణా అక్బర్ని ఎదిరించాడు.ఎంతో మంది రాజపుత్ర స్త్రీలు తమమాన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అగ్ని కి ఆహుతి అయ్యారు. "చిత్తౌడ్ ను మ్లేచ్ఛుల బారి నుంచి  తిరిగి తీసుకునేదాకా బంగారు పళ్ళెం లో అన్నం తినను.పట్టు పరుపుపై నిద్రించను"అని ప్రతినబూనాడు.అతని సర్దార్లు అండగా నిలిచారు. 1576కల్లా అపారసైన్యం ఉన్న అక్బర్ని ఢీకొట్టడంలో భాగంగా కోటను విడిచి కమలమేర్ అనే దుర్గంలో ఉన్నాడు.ఆయన గుణగణాలు వర్ణిస్తూ  శీతల్ అనేకవి చేసిన వర్ణనకు జనం ఉప్పొంగిపోయారు.రాణా తన తలపాగాను తీసిఅతని తలపై పెట్టి ప్రణామం చేశాడు దర్బార్ లో అందరిముందు!
శీతల్ ఆగ్రా వెళ్లి  అక్బర్ దర్బార్ లో తన తలపాగాను తీసి పక్కన పెట్టి అభివాదం చేశాడు. "అలా ఎందుకు చేశావు?"అక్బర్ ప్రశ్నకు శీతల్ ఇలా జవాబు ఇచ్చాడు"జహాపనా!ఈతలపాగా మేవాడ్ ఆత్మాభిమానం వీరశూరత్వం గల మహారాణాప్రతాప్ ది.నాతలని మీముందు  మా భారతీయ సంస్కృతి ప్రకారం వంచుతాను.కానీ రాణా తలపాగా ఎవరిముందూ తలవంచదు." అక్బర్ సేనాపతి  రాజామాన్సింహ్  రాణా ప్రతాప్ ని కలవాలని వచ్చాడు.  శత్రువుతో చేతులు కల్పిన అతనికి ఎంత మర్యాదగా అవమానం చేశాడో చూడండి. తన కొడుకు అమరసింహునిచేత అతిధిసత్కారాలు చేయించాడు.కానీ అతనిని కలవలేదు. "మాన్సింహ్!నీవు రాజపుత్రుల గౌరవాభిమానాలు మ్లేచ్ఛులకి అమ్మిన ద్రోహివి.తుచ్ఛుడివి.మీ ఇంటి ఆడపిల్లలనుమొగలులకిచ్చి వారిని  బానిసలు గా మార్చిన  చీము నెత్తురు లేనివాడివి"
అని లేఖ రాసి పంపాడు.రోషంతో మాన్సింహ్ "రాణా!నన్ను బాగా అవమానించావు.నాచేత చావుదెబ్బలు తింటానికి సిద్ధంగా ఉండు"అని బుసలుకొట్టి అక్బర్ దగ్గర భోరుమన్నాడు.ఎంత సిగ్గు శరం లేని దేశద్రోహి!?
రాణాను తన గుప్పిట్లో బిగించాలని అక్బర్ చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి.
 2లక్షలసైన్యంతో మాన్సింహ్ మేవాడ్ కి కదిలాడు. రాణా  గిరిజనలు బిల్లులను సైన్యంలో చేర్చాడు.వారు అక్బర్ సైన్యంపై వానరసేనలా రాళ్లు బాణాలతో విరుచుకు పడ్డారు. రాణా తన గుర్రం చేతక్ ని ఎక్కి మాన్ సింహ్ యువరాజు సలీంని ఢీకొన్నాడు.తమ్ముడు శక్తి సింహ్ మొగల్ సైన్యం కి సాయంచేశాడు.1576లో హల్దీఘాటీ రాణా ప్రతాప్ వీరత్వానికి పొంగిపోయింది.చేతక్ రాణాప్రాణాలు కాపాడి శాశ్వత నిద్రలోకి ఒరిగింది. ఆమూగప్రాణికున్న విశ్వాసం  జనాలకి లేదు. గోంగడాదుర్గంలో ఉన్న మాన్సింహ్ పై రాణా దాడి చేసి అక్బర్ కి  గంగవెర్రులెత్తించాడు.భార్య పిల్లలతో తిండి తిప్పలు లేకుండా అల్లాడుతూ తలవంచలేదు.ఆయనభార్య అడవిలో దొరికే గింజలు దుంపలు ఉడికించి పిల్లలకు పెట్టేది. పిల్లలతో అనేది"రేపటికి రొట్టె దొరుకుతుందో లేదో?కాస్త  దాచుకోండి".కూతురి చేతిలోని రొట్టెను అడవిపిల్లి లాక్కెళ్ళితే చూసి బాధ పడ్డాడు కానీ దాసోహం అనలేదు. భామాషా అనే రాణామంత్రి సాయంతో ఝంఝావతి దేవియార్ కమల్మేర్ కోటలను వశపర్చుకుని మేవాడ్ ని తన ఆధీనంలోకి తెచ్చాడు. రాణా కి బాసటగా జోధ్పూర్  బుందీ ఇడర్ పాలకుల సహాయం తో అక్బర్ కి చెక్ పెట్టాడు.యుద్ధాలు  సరైన తిండి తిప్పలు లేక చిత్తౌడ్ ని జయించాలనే కోరిక తీరకుండానే అమరుడైనాడు.మేవాడ్ సింహంరాణా ప్రతాప్ లా ఉంటే మన దేశం ఇప్పటి  అంతః బాహ్య శత్రువులని  తుదముట్టించగలదు.ఇదే మనం రాణాకి అర్పించే నివాళి.
కామెంట్‌లు