కృష్ణవేణి.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 కిలకిల నవ్వులతో కృష్ణమ్మ.
కనులవిందుగా కదలి రావమ్మా.
సహ్య పర్వత శ్రేణుల్లో జన్మించిన విష్ణు స్వరూపిణి
సర్వజీవ ప్రాణ దాయిని
ఉపశాఖలు వచ్చి చేరి వైభవముగా మహా ప్రవాహమై సాగేవు
ముచ్చటగా మూడు రాష్ట్ర భూముల
 నీ ఆట పాటలతో చేసేవు సస్యశ్యామలం
నీ తీరమందే ఎందరో రాజులు ఏలిరి.
ఘన ప్రశస్త తో తీర్ధాలు ఎన్నో వెలిసాయి
పంచారామ ములలో శ్రేష్టి అమరావతి క్షేత్రం.
దర్శించినంత కలుగు పలు శుభములు.
నీ జల ధారల స్నానం అతి పవిత్రం.
కన్యారాశిలో గురు సంచారం పుష్కరుడు నీలో నిండే.
కృష్ణవేణి నమస్తుభ్యం అంటూ ప్రజా సం ప్రీతితో నేను కొలిచేరు.
పచ్చని పంటలకు జీవన్ ఆధారమై 
అన్నపూర్ణగా వెలసిన కృష్ణమ్మ వు.
దాహార్తి తీర్చే తాగునీరు పంటలను పండించే 
సాగునీరు వి రైతన్నలకు జీవనాధారమైన కృష్ణవేణి నమస్తుభ్యం
కామెంట్‌లు