*వనమహోత్సవం-విశ్వవికాసం*("రాజశ్రీ"సాహితీ ప్రక్రియలో)(మూడవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 9)
పౌరాణిక గాధల ఊహింపుము
అరణ్య విలువను గ్రహింపుము
బుద్ధునికి జ్ఞానమొసగె వృక్షము
దానికీర్తి ఎగబాకె ఋక్షము!
(ఋక్షము=నక్షత్రము)
10)
వనజనిత వేణు కాయము
పరమాత్ముడు హరికి పూజనీయము
మోహన మురళీరవమున లోకము
మోహమున పొందినది చిత్తపరిపాకము!
11)
శ్రీరామునివాసము పంచవటి అంటాము
చిత్తము అలరించేగాధ వింటాము
కృష్ణుని బృందావనసంచార తరుణము
హరికృపా వ్యాప్తమునకు తార్కాణము!
(తరుణము=సమయము)
12)
తులసీ దళముతో కృష్ణునితూకము
తూచెను రుక్మిణి నాకము
స్వర్ణమయ లంకకు జోత
అశోక వనమున సీత!
(సశేషము)

కామెంట్‌లు