*ద్విత్వాక్షర గేయాలు**ట-ట్ట ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 మా వూరికి ఆనుకుని చెరొవొక్కటి ఉంది
ఆ చెరువు గట్టు మీద పూల చెట్టు ఉంది
చెట్టు మీద అందాల పిట్ట ఒకటి వాలింది
చెట్టు కింద పామొకటి పిట్టను చూసింది
గబగబా పాక్కుంటూ దగ్గరకు పోయింది
బుసకొట్టుకుంటూ పిట్టనూ పట్టబోయింది
తేనెతెట్టులోని ఈగలు పాముని చూశాయి
చుట్టు ముట్టి పాముని గట్టిగా కుట్టినవి

కామెంట్‌లు