శివదండకం.:-మచ్చ.అనురాధ.సిద్దిపేట.

 శివనామమును నేను 
ఏవేళలోనైనధ్యాన్నింతునిత్యంబు,
మెండైన రూపంబుతోనీవు సూక్ష్మాతి,
సూక్ష్మముజ్యోతిర్మయీరూప 
లింగేశ ,
శ్రీరాజరాజేశ్వరానన్ను బ్రోవంగ ,
జాగేలనీకింతనాపైన రావయ్య ,
భీమేశ్వరారామలింగేశ్వరానీవు 
శ్రీచంద్రమౌళీశ్వరావేగరారమ్ము ,
శ్రీకోటి లింగేశ్వరా కాశి  విశ్వేశ ,
మృత్యుంజయేశుండు రావేల మమ్మేలు ,
యేపేరులోనైననీరూపెదర్శించి  
నామయ్యగుండెల్లొకోవెల్లకొల్వైన , 
కోటీశ్వరానిన్నుకోరేముమాయండ ,
నీపూజగావింపనేతీరుజేయాలి 
ఏపూలుతేవాలొయేపేరుబిల్వాలొ ,
నీపాదపద్మాలచెంతందునేజేరి ,
ఓనీలకంఠుండ ఓపార్వతీవల్ల
భా శ్రావణామాస నీదీక్షబట్టేము
నీభక్తులన్ బ్రోవనందీశ్వరా రావ
నిత్యమ్ముసేవింతునీపేరుకీర్తిస్తు 
నీరూపువీక్షిస్తునిండార లోకాల ,
నేలేటి లోకేశ నన్నీవుబ్రోవంచు ,
దండంబునేజేతుసోమేశ్వరా....

కామెంట్‌లు