అమ్మ : -- కాడబోయిన స్వాతి. గ్రామం:::నీర్మాల. జనగామ జిల్లా.

 లాలి లాలీయని లాలించి వెన్నెలను
జూపివెన్నె పెట్టి
కమ్మనిపాటబాడి కంటి 
కునుకు మాని
కష్టంతోబెంచితివి 
 అమ్మ 
నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి....
 వెచ్చని నీ ఒడిలో ఎదిగి చుక్కలా అలంకారించి
చురుకైన విద్యకు దోలి
వెనుదిరిగి బాధ పడి తిరిగి వచ్చే సందెకు ఎదురు వచ్చితివి
 అమ్మ !నీ కమ్మని పిలుపు మళ్లీ వానలి
 అందంగా కనిపిస్తే కమ్మటి ముద్దులిచ్చి
అంతగా అల్లరి చేస్తే చంప పై ఒక్కటిచ్ఛి 
అలిగి నిదరోతె అన్నంపెట్టేవు 
అమ్మ నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి
 మిత్రులతో బయటకు వెళితే మరి మరి
భయం చెప్పి 
జేబులోకి డబ్బులిచ్చి
జ్వరం వస్తే వైద్యునివైతివి ఆటకు మిత్రుడివైతివి
అమ్మ నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి
      
కామెంట్‌లు