తాళపత్ర గ్రంథాలు;-కంచనపల్లి వెంకట కృష్ణారావు

 తన తరగతి  పిల్లల్ని నల్లమల అడవికి  తీసుకెళ్ళి ప్రత్యక్షంగా  అడవిని చూపించి వివరించాలని,అడవులవలన లాభాల గురించి  వివరించాలని శ్రీధర్ మాష్టారు మంచి ఆలోచన చేశాడు. 
    అన్నట్టుగానే మరుసటి రోజు ఆదివారం  అందరినీ  వ్యాన్లోమమ  తీసుకుని నల్లమల  అడవికి  వెళ్ళారు.
       అడవిలో  ఎత్తైన  చెట్లు,  వెదురు చెట్లు, కొన్ని  వింత పక్షుల్ని, విచిత్రమైన పువ్వులను చూపించి  వాటిని  గురించి  వివరించారు  శ్రీధర్ మాష్టారు .   స్వచ్ఛమైన గాలి (ఆక్సిజన్) పిల్లల మెదళ్ళను ఉత్తేజ పరిచింది! ఆ గాలి, ఆకుల మంచి  వాసన వాళ్ళలో ఏదో సంతోషం నింపింది!
   పిల్లలు ఆ విషయాలు  తమ నోట్ బుక్స్ లో వ్రాసుకున్నారు
     "పిల్లలూ, ఇక్కడ  వాతావరణంలో కాలుష్యం  లేదు, స్వచ్చమైన  గాలి మనకు అలసట  లేకుండా చేసి,  మంచి  ఆలోచనలు కూడా పెంచుతుంది! అందుకే పూర్వ కాలంలో రాజులకు సలహాలు  ఇవ్వడానికి ఋషులు అడవిలోనే ఉంటూ తపస్సు  చేసి ఏకాగ్రతతో  మంచి ఆలోచనలు  చేసి మంచి  పరిపాలనకు అనేక సూచనలు  చేసేవారు!" అని  వివరించారు  శ్రీధర్  మాష్టారు. 
       "  ఋషులు అడవుల్లో ఎందుకు తపస్సు  చేసేవారో ఇప్పుడు  మాకు  అర్థమయింది  సార్" అని  పిల్లలు  ముక్తకంఠంతో  అన్నారు.
   "ఆ ఎత్తైన  చెట్లు వానాకాలంలో మేఘాలు  ఆపి వర్షాలు  కురిసేటట్ఠు చేస్తాయి, పంటలు  బాగా పండుతాయి.ఇంకొంచెం అడవి లోపలికి తీసుకెళ్ళి ,వింత సీతాకోకచిలుక లు,పెద్ద ఉడతలుచూపించారు,అంటే అడవి బాగుంటే ప్రాణవాయువు  ఉత్పత్తి  బాగుంటుంది, అది జంతువులకు, దూరంగా ఊర్లో ఉన్న మనకు తెలియని మేలు చేస్తుంది! అడవిలో రకరకాల జంతువులు, పక్షులతో జీవవైవిధ్యం  ఉండి వాతావరణం సమతుల్యమవుతుంది" అని  అడవులను గురించి చెప్పారు శ్రీధర్ మాష్టారు. 
ఆ మంచి మాటలు విన్నాక పిల్లలు  చప్పట్లు కొట్టారు. 
    ఆ మధ్యాహ్నం  అందరూ ఇళ్ల నుండి తెచ్చుకున్న కమ్మని భోజనాలు చెట్ల క్రింద  తిని,కొంచెం  సేపు విశ్రాంతి  తీసుకున్నారు.
     అందరూ హుషారు అయ్యాక దగ్గర  లోనే ఉన్న రుద్రవరానికి తీసుకెళ్ళారు
. ఎందుకంటే  అక్కడ  ఉన్న ఆనందస్వామి ఆశ్రమం లో తాళపత్ర గ్రంథాలు(తాటి  ఆకుల  గ్రంథాలు) . అనేకం  ఉన్నాయి . పిల్లల కు వాటిని  చూపించి వివరించాలని శ్రీధర్  మాష్టారు ఆలోచన.
       ఆనంద స్వామి అందరినీ సాదరంగాఆహ్వానించి, పిల్లలను  ఆశీర్వదించి తలా గ్లాసు పాలు ఇచ్చారు. తరువాత  శ్రీధర్ మాష్టారు  అభ్యర్ధన  మీద తాళపత్రం గ్రంథాలు పిల్లలకు చూపించి  ఈ విధంగా చెప్పారు.
    "పిల్లలూ,వీటిని  తాళపత్ర గ్రంథాలు  అంటారు.  కొన్ని వందల సంవత్సరాల  క్రితం మనకున్నట్టు కాగితాలు  లేనప్పుడు అప్పటి కవులు కవిత్వం, పురాణాలు, సంస్కృత నాటకాలు ఘంటం అనే  ఇనప కలంతో  తాళపత్రాల మీద వ్రాసే వారు.ఆ ఆకులు  చెడిపోకుండా వాటిని ప్రత్యేకంగా తయారు చేసేవారు! అందుకే  ఇన్ని వందల సంవత్సరాలు అయినా ఇవి చెడిపోకుండా పోలేదు!" అంటూ  ఒక తాళపత్ర  గ్రంథం  తీసి చూపారు. అందులో లిపి ,  భాష చాలా  కష్టం గా ఉండి పిల్లలు  చదవలేకపోయారు. కొన్ని  ఆకుల మీద శ్లోకాలు వాటికి  సంబంధించిన  బొమ్మలు  కూడా ఉన్నాయి!
    "ఈ గ్రంథాల్లో  వేటిని గురించి వ్రాసి ఉంది?" అడిగాడు దాసు అనే కుర్రాడు. 
     "మంచి ప్రశ్న అడిగావు నాన్నా, వీటిలో మనకు తెలియని పురాణాలు, మానవ నడవడికలను గురించి వ్రాసి  ఉంది. అయినా  ఇవి  చాలా మటుకు  మనకు  అర్ధం  కావు! అందుకే అనేక మంది పండితులు తాళపత్రాల మీద  పరిశోధనలు  జరిపి అందరికీ  అర్ధం  అయ్యేట్టు పుస్తకాలు  ప్రచురించారు.  పంతొమ్మిదో శతాబ్దంలో  వేటూరి  ప్రభాకర  శాస్త్రి గారు బోలెడు  తాళపత్ర  గ్రంధాలు పరిశోధించి ప్రచురించారు!  నా దగ్గర ఉన్న  చాలా తాళపత్ర  గ్రంథాలమీద పరిశోధనలు జరగాలి " అని  చెప్పారు ఆనంద స్వామి. 
     "స్వామీ, మీరు అనుమతిస్తే ,నాకు తెలిసిన  విశ్వవిద్యాలయం  సంస్కృత  ఆచార్యుడు  ఉన్నారు.  అతను ఈ గ్రంథాలను పరిశోధించడంలో దిట్ట, ఆయన పరిశోధనవలన గ్రంధాలలోని విషయాలు కాలగర్భంలో కలసి పోకుండా  ప్రపంచానికి  తెలుస్తాయి,మన తాళపత్ర  గ్రంథాలను అనేక మంది పాశ్చాత్యులు, మాక్సముల్లర్ లాంటి వారు పరిశోధించారాని మీకు  తెలుసుకదా  స్వామి"అన్నారు  శ్రీధర్  మాస్టారు. 
    "తెలుసు  నాయనా,  వీటి మీద పరిశోధనలు  చెయ్యాలంటే ఎవరైనా  ఇక్కడకు రావలసిందే, అంతేగానీ గ్రంథాలు  బయటికి  ఇవ్వను.  ఎందుకంటే  ఇవి చాలా  అరుదైనవి,పరిశోధకులు ఎవరు వచ్చినా భోజన వసతి, తదితర వసతులు  నేను చూసుకుంటాను" అని  చిరునవ్వు తో చెప్పి అందరినీ ఆశీర్వాదించారు.
           "చూశారా, పిల్లలూ, ఈ రోజు అడవిని గురించి  మరింత  తెలుసుకున్నారు, ముఖ్యంగా మీరు ఎప్పుడూ  చూడని  తాళపత్ర  గ్రంథాలను గురించి తెలుసుకున్నారు. ఈ మంచి  విషయాలు మీ నాన్న, అమ్మలకు చెప్పండి.అన్నీ  తేదీ తో సహా  నోట్  బుక్ లో
 వ్రాసి చూపించండి"
  "తప్పకుండా సార్ "అన్నారు  పిల్లలు. 
    అందరూ  ఆనంద  స్వామి  వద్ద  శెలవు తీసుకుని  బయలుదేరారు..
       మూడు రోజుల  తరువాత శ్రీధర్  మాష్టారు  విశ్వవిద్యాలయం  పరిశోధకడువెంకటరావుకు తను చూసిన తాళపత్ర గ్రంథాలను గురించి  వివరించారు. 
    ఆయన మాటలు  విన్న  వెంకట రావు "తప్పకుండా అక్కడికి వెళ్ళి పరిశోధనలు  చేస్తాను,నా కంప్యూటర్  లో వాటిని  ఫీడ్ చేస్తాను.
    ఆయన  మాటలు  విన్న శ్రీధర్ మాష్టారు  ఎంతో సంతోషించారు.ఎందుకంటే  మరుగున పడి  పోతున్న తాళపత్ర  గ్రంథాలు  వెలుగు చూడబోతున్నందుకు 
కామెంట్‌లు