అన్నా చెల్లెల అనుబంధం(ముత్యాల హారాలు):--గద్వాల సోమన్న
అన్నాచెల్లెల బంధము
అనురాగాల సుగంధము
మహిని రక్షాబంధనము
మదిని విరియును సంబరము

ప్రేమతో చెల్లి కట్టును
అభిమానము ఇల చాటును
అన్న అభయము ఒసగును
రాఖీ రక్షణ ఇచ్చును

మమకారాల మాలిక
చెల్లి ఇచ్చే కానుక
పవిత్రతకిది ప్రతీక
దీనికి సాటి లేదిక

భారతీయుల వేడుక
రాఖీ కట్టుట వాడుక
అనుబంధాల సూచిక
మరుపురాని ఘన జ్ఞాపిక

ఆడపడుచులకు వరము
మన దేశ  సంప్రదాయము
సోదరులకు శుభకరము
సోదరీమణుల మోదము
.


కామెంట్‌లు