*రేపటి భారత పౌరులం*( *బాలల గేయాలు*):- *గీతారాణి అవధానుల (మయూఖ)*
పిల్లలము మేము..పసిపిల్లలము మేము..
రేపటి భారత పౌరులమే మేము..
పిల్లలము మేము.. పసిపిల్లలము మేము..
వసివాడని నవ్వుల పువ్వులమే మేము..

కురిసే చిటపట చినుకుల్లో..
మువ్వల సవ్వడి మాదే..
విరిసే ఇంద్ర ధనస్సులో
ఏడు రంగులు మేమే..|పిల్లలము|

ఇసుకతోనె మేం కోటలు కడతాం..
కోయిలమ్మతో పాట పాడుతాం..
ఇలలో అన్ని ఆనందాలకు..
మేమే వారసులవుతాం...|పిల్లలము|

బడిలో ఆటలుపాటలతో
విద్యా బుద్ధులు అన్నీ నేర్చి
తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చే..
చిరంజీవులం మేము..|పిల్లలము|
*********************
         *మయూఖ* 
*********************

కామెంట్‌లు