నేనెవరో తెలుసా?.తాటికోల పద్మావతి గుంటూరు.

 అండం లోంచి పుడతారు.
అనాకారి గా ఉంటాను
ఆకులలములు తింటాను
ఆరోగ్యంగా ఉంటాను
వంటికి వెంట్రుకలుంటాయి
తాకితే దురదలు వస్తాయి
అందరూ ఛీఛీ అంటారు
చీపురుతో దూరంగానెడతారు.
అయినా నేనంటే భయపడతారు.
ఆకుకూరలు తిన్నాక 
చక్కని గూడు కడతాను 
హాయిగా గూటిలో నిదురిస్తాను.
గూడు పగలగొట్టుకుని
 అందాల చిలుకగా ఎగిరే వస్తాను
చుక్కల రెక్కలతో ఎగరేస్తాను.
సీతాకోక చిలుక గా మారి 
అందంగా పూలపై గంతులు వేస్తాను.
తోటలో నా సందడి చూసి 
పిల్లలంతా నన్ను అందుకోవాలని 
ఎగిరెగిరి నాతో పోటీపడతారు.
పూల కన్నా మెత్తటి రెక్కలు నావి. 
చుక్కల చీర తో అందంగా 
ఎగురుతూ ఉంటే హాయిగా నవ్వుకుంటారు
కామెంట్‌లు