రచయిత్రి ధనాశి ఉషారాణి కి తెలుగు భాష సేవా పురస్కారం


 చిత్తూరు జిల్లా  చిన్నగొట్టిగల్లు మండలము  భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి కి 'తెలుగుభాష సేవా ' పురస్కారం.తెలుగు భాష దినోత్సవం రోజున వరించింది.'తెలుగు భాషాదినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన తెలుగు 'భాషోద్యమం' అనే అంశంపై నూతన కవితాప్రక్రియలో సున్నితాలు లిఖించి గిడుగు వారికి సమర్పించి,తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్న   సాహిత్య ప్రతిభను అభినందిస్తూ సాహితీ బృందావన  జాతీయ వేదిక వారిచే "తెలుగు భాష సేవా" పురస్కారం వాట్సప్ వేదిక   ప్రదానం చేయడమైనది. పురస్కార గ్రహీత ధనాశి ఉషారాణిను  సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.


కామెంట్‌లు