*వనమహోత్సవం-విశ్వవికాసం*("రాజశ్రీ కవితా ప్రక్రియలో)(రెండవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 5)
బతికినంత కాలము ఫలిస్తుంది
ప్రాణికోటికి సేవలు చేస్తుంది
క్షమ కలిగిన తరుసంపద
పెంచుకోవాలి ఎల్లప్పుడు వృక్షసంపద!
6)
వనసంపద వర్షముకు మూలము
పరమ సత్యమిది చూసినకాలము
కృత్రిమ సంపదలను కూర్చుచుంటివి
క్లిష్ట విపత్తులను విడకుంటివి!
7)
అణుధార్మిక సెగలు రేపుకొంటివి
అనర్థములు జీవకోటికి ఇచ్చుకొంటివి
కర్మాగారపు పొగలను పీల్చుకొని
కళాహీన జీవనమును మిగుల్చుకొని!
8)
ధ్వని కాలుష్యము దిశలనిండె
ధోరణిలో అప్రశాంతత నిజముఉండె
మంచిగాలి నీరునీడ వెదికితే
ఎంత బాగుండు దొరికితే!
(సశేషము)


కామెంట్‌లు