*నవ్వులు* *సాంస్కృతిక నేపథ్యం*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 52.చంద్రుని నవ్వు,
      అపవాదుకు ఆహ్వానం!
      ద్రౌపది నవ్వు,
      ఆపదకి ఆరంభం!
53.శౌరి నవ్వు,
     శుభ శకునం!
     శకుని నవ్వు,
      అపశకునం!
54.రాముని నవ్వు,
     జన రంజకం!
     రావణుని నవ్వు,
     లోక కంటకం!
55.సీత నవ్వు,
      శ్రిత పారిజాతం!
     శూర్పణఖ నవ్వు.
     వికృతరూప కారకం!
56.ప్రహ్లాదుని నవ్వు,
      పరమభక్తిలో ఆహ్లాదం!
     హిరణ్యకశిపుని నవ్వు,
     దైవదూషణకు మూలం!
57.నాగమ్మ నవ్వు,
      పలనాట విషాదం కవ్వు!
     బ్రహ్మనాయుని నవ్వు,
  సమాజాన సమానత్వమివ్వు!
          (కొనసాగింపు)

కామెంట్‌లు