ముత్యాల హారాలు:-*రాథోడ్ శ్రావణ్*ముత్యాలహారం రూపకర్తఉట్నూరు


మన రామ్మూర్తి పంతులు
భాషా మూల పురుషులు
సవర భాషా గిరిజనులు
అందించేను అక్షరాలు
 
గిడుగు రామ్మూర్తి జయంతి
తెలుగు భాష ప్రజాపతి
వాడుక భాషల అధిపతి
గిడుగు బాబు సీతాపతి

సవర భాష పండితులు
గొప్ప సాహితీవేత్తలు
శ్రీకాకుళం వాసులు
తెలుగు భాషలో సేవలు

కందుకూరి మిత్రులు
రచన సవర పుస్తకాలు
చింతామణి రచనలు
సాధించిన అవార్డులు

సరస్వతి మాత పుత్రులు
భాషాకై ఉద్యమాలు
అపే బాల్యవివాహాలు
గొప్ప సంఘసంస్కర్తలు

తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారు 29 ఆగష్టు 1863‌ న జన్మించారు.అయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము

కామెంట్‌లు