అవతారం: -ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
దీపం గుడ్డిదయ్యిందీ
కనురెప్పలు విప్పిన చూపులు అయినట్లు!?
గుర్తించడం అంటే మరణించడం గా మారింది
ఉన్నట్లు ప్రకటించడం పాపపుణ్యాలు మూట కట్టుకోవడమేనా!?
ఆకాశంలో చేరేవీ నక్షత్రాలు రాలి పడేవి కావు!?

కరిగిపోయే సూర్యుడు మరుగుతున్న నీరు 
మరో ప్రపంచం కన్న కల 
ఇంకా కొద్ది దూరంలోనే ఉంది!?

దగ్గర కవుతూనే దగ్ధమవుతున్న విశ్వం
 కోట్ల స్వప్నాల్ని గర్భంలోనే కంటుంది!?

కాంతిని కాలాన్ని పరిగెత్తించి చింతిస్తున్న 
పదార్థం ఇంకా లెక్కల్లోనే మునిగి తేలుతున్నట్లు తేలింది!?

భూమిలోనే దాచిపెట్టిన బంగారం
 అంగారక గ్రహం పత్రాలపై 
సూర్యచంద్రులు సంతకాలు చేస్తున్నాయి!!

చేను కంచె మేసినట్లు బంగారం 
కంచు మోగినట్లు కొంచెం కొంచెం కనిపిస్తుంది!?

తప్పిపోయిన ప్రశ్నలు సంచుల కొద్దీ
 సమాధానాలు మోస్తూ తిరుగుతున్న భూగోళం 
వృద్ధాప్యంలోకి నెట్టివేయబడింది 
ఏమో ఒంటరి తనం చింత అంతు పట్టకుండా ఉంది ఇప్పుడు!?

నాలుగు నవ్వులు పూసే చెట్లు 
ఇప్పుడిప్పుడే భూమిపై పుడుతున్నాయి
నాలుగు మాటలు కాసే తోటలు 
తొలిసారి కాపు కాస్తున్నాయి!?

అమాయకత్వం పిల్లి రూపంలో విశ్వాసం 
కుక్క రూపంలో పుడ్తున్నట్లు సమాచారం!?

సింహం నక్క మగాడు గా
ఆడపిల్ల అంటే గుడ్డి దీపం కాదు 
అమ్మగా అవతారం ఎత్తుతున్న ట్లు 
నిజం నమ్మకంగా చెబుతుంది!?

Pratapkoutilya lecturer in Bio-Chem
8309529273palem

కామెంట్‌లు