పద్యాలు : బెజాగం శ్రీజ , గుర్రాలగొంది

 *సీసమాలిక*
ఎమ్మిగనూరులో నమ్మిన దేవున్ని
ఆరాధననుజేయు హాయిగాను
పసుపులగోత్రము పరవశమొందగ
ముందుకేగుచునుండె మోదమలర
రంగయ్య,నరసమ్మ రాజిల్లుచుండగ
వారిరువురిగర్భ వాసమందు
నాగన్నజన్మించి నచ్చినరీతిలో
లక్ష్యాలుఛేదించె లక్షణముగ
అంజినమ్మనుజూసి నందంగపెళ్ళాడి
కలసిమెలసియుండె కాపురమున
యిద్దరు పుత్రులన్ ముద్దుగకనిపెంచి
ప్రేమనుపంచెను పేర్మితోడ
చదువునుచక్కగా శ్రద్ధతో నేర్వగ
ఉద్యోగమునుపొందె యున్నతముగ
అద్వితీయముభాష నరమరికలులేక
హిందినేర్చుకొనెను హితముతోడ
పాఠములెంతయొ బాగుగాబోధించి
యర్థమయ్యేలాగ నందరికిని
తోటివారికిబాగ తోడుగనిలిచియు
సహకారమునుపొందె సౌఖ్యముగను
యెన్ న్సీసిసర్వీసు యిష్టంగజేసియు
శిక్షణయిచ్చెను శీఘ్రముగను
పిల్లలపట్లను ప్రీతినెనింపియు
వెలుగునేనింపునే తెలివితోడ
*తేటగీతి*
గురువు నాగన్న గారలు గొప్పగాను
విద్యలెల్లనునేర్పెను వినయముగను
శారదాదీవెనలుపొంది సంతసముగ
నాయురారోగ్యములతోటి యలరుచుండు.
 
కామెంట్‌లు