పారిజాత సుమ హారికలు: - పద్మ త్రిపురారి--జనగామ.

 పల్లవి::
పారిజాత సుమ హారికలు
తులసీదళముల మాలికలు
వేచెను కృష్ణా!నీకోసం
వీచిన పరిమళ పవనముగా.
      "పారిజాత"
చరణం;;
మధురా నగరిలొ గోపికలు
సుందర వదనా దీపికలు
వచ్చిరి కృష్ణా!నీకోసం.
తెచ్చిరి కృష్ణా!నవనీతం.
           "పారిజాత"
చరణం:
చిన్ని లేగలు పరుగిడెను
చల్లని ఒడిలో చేరుటకై
నల్లని వాడా!శ్రీ కృష్ణా!
మురళీ మోహన!యదుకృష్ణా!
చరణం::
ఘల్లు ఘల్లుమను అందెలతో
గలగల గాజుల రవళులతో
మనసున కురిసిన మధువులతో
ముదితలు వచ్చిరి శ్రీకృష్ణా!
      "పారిజాత"
చరణం::
తడవ తడవకు నిను తలచి
మీగడ పాలను తలదాల్చి
కడవల దొంతర పేర్చుకొని
కదిలిరి కృష్ణా!నీకోసం.
       "పారిజాత"
     
కామెంట్‌లు