చీర-సాహితీసింధు సరళగున్నాల

కం*ఆరుగజమ్ములచీరయు
తీరౌనీయందమంత తెరదీసినటుల్
చేరగస్వర్గసుఖమ్ములు
దారైనీకమరియుండు తనువుప్పొంగన్

మ*తలపున్సిగ్గులుచుట్టుముట్ట మదికిన్తాజుట్టునోకోకయున్
వలపున్గప్పెడినాయుధంబు, నదియే వానందునోఛత్రమై
చలికిన్కర్ణములందుజుట్టు కొనగా,చంటోడి నాసిక్యమున్
చిలుకన్చీమిడితూడ్చుచీరనెపుడున్ శ్రేయంబునేగూర్పుగా

ఉ*వచ్చిన కూరగాయలకు బస్తనుదేవగ గుర్తులేకయున్
మెచ్చకనత్తతిండినిడ మేలునుగూర్చెడువారలిచ్చినన్
నెచ్చెలులేమితెచ్చినను నీడగదాచెడి చీరకట్టుయే
స్వచ్ఛపుభారతీయతను చాటగవారధిసంప్రదాయమున్
కామెంట్‌లు