ఆరోగ్యాన్నిచే కీరాదోస కాయ (Cucumber )...-పి . కమలాకర్ రావు

 కీరా దోస కాయలో పోషకవిలువలుచాలాఎక్కవ. ఇది మనలోని చురుకుదనాన్ని పెంచుతుంది. త్వరగా అలుపు రానివ్వదు. కీరా తినడం వల్ల మూత్రంలో మంట రానివ్వదు. ఆగి ఆగి మూత్రం రావడం కూడా తగ్గి పోతుంది. కీరా మానసిక అశాంతి (Stress) ని తగ్గిస్తుంది.
ప్రారంభ దశ లోని మూత్రపిండాల  సమస్య తగ్గుతుంది. మూత్రములో పిండాల సమస్య ఎక్కవవున్నవారు కీరా తినకూడదు.
రాత్రి పూట కీరా తినకూడదు. తింటే నిద్ర రానివ్వదు. జలుబు, దగ్గు, దమ్ము ఉంటే కీరా తింటే ఎక్కవవుతుంది. కాబట్టి తినకూడదు.
పెరుగు తో కీరా వేసి కొందరు సలాడ్ గా   తింటారు. ఎక్కవరోజులు తింటే  ఆరోగ్యానికి హానికరం. జ్వరం వస్తుంది. ఇవి విరుద్ధహారాలు.
కీరాతురుము , క్యార్రట్ తురుము టొమాటో   సలాడ్ తయారు చేసి ఉల్లిపాయలు, నిమ్మరసం పిండి భోజనములో తింటే ఉదర సమస్యలు  రాకుండా కాపాడుతుంది. పెద్ద ప్రేవులకు (Large Intestine ) శక్తినిస్తుంది.


కామెంట్‌లు