శంకరoబాడి సుందరాచారి గారు (ఇష్టపదులు)-ఎం. వి. ఉమాదేవి
అలతియగు పదములను అల్లికై పాడిరిక 
మా తెలుగు తల్లికిని మల్లెపూ దండగా 

శంకరoబాడి సిరి సంపదగ వ్రాసితిరి 
గీతాంజలిని లోని గేయభావము చెడక 

అనువాద మొందించి అనుభూతి చెందితిరి 
సుందర రామాయణ సూత్రమును యందుకొని 

తాటకిని భీకరము తటస్థురాలి జేసె 
లలితమ్ము భావనల లక్షణమ్ముల నొసగి 

తేట కవితార్చనము తీయగును తెనుగునను 
కొంకులేనట్టివై జంకు లేకనె వ్రాసె

భుక్తికిని పనిచేసి భువనమున వివిధముగ
సర్వరుగ కూలీగ సరి యుపాధ్యాయునిగ

భజన రచనలు తాను భావ్యముగ జేయనని 
ఉద్యోగమును వదిలి ఉపయోగ రచనలిడె 


సూర్యకుమారి గొంతు సుందరముగా పాడె 
జాతీయ భావనలు జయములను పలుకగా !!

మహనీయులకు జేతు మరిమరీ వందనము 
ఉమాదేవి గీతము ఉడిపి కృష్ణుని వరము !!
కామెంట్‌లు