అందమైన పాఠశాల:-: బోయిని శిరీష - ZPHS నీర్మల జనగాం జిల్లా

 ఒక అందమైన ఊరిలో ఒక మంచి రంగు రంగు పువ్వుల మొక్కలతో నిండిన ఒక అందమైన పేరు ప్రఖ్యాతి గాంచిన పాఠశాల ఉంది.అందులో ఎంతో మంది విద్యార్థిలు చదువుతూ వారి పై చదువులకి వెళ్తుంటారు. కాని ఒక పేదింటి , మంచి మర్యాదలు, సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి ఉండేది. తన పేరు "అక్షర ". ఆ అమ్మాయికి తన పాఠశాల అన్నా , చదువన్నా, ఉపాధ్యాయులన్నా చాలా గౌరవం. చదువే తన ప్రాణంగా భావిస్తు అన్నీ కార్యకలాపాలలో ముందు నడుస్తుంది. వాల్ల ఉపాధ్యాయులు తనని ముందడుగు వేయడానికి ఎంతో ప్రొత్సహించేవారు. తను పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో  ఉంటే తన 'ఉపాధ్యాయులే" స్వయంగా కొనిపించేవారు. వాల్ల అమ్మ,నాన్నలు ఒక్కరోజు పనికి వెళ్లకుంటే వాళ్లకు ఒక్క పూట కూడ గడవనీ కుటుంబంలో పుట్టి పాఠశాలకు సెలవులు వస్తె తనుకూడా పొద్దంతా పనికి వెల్లి రాత్రి ఇంటికి వచ్చి చదువుకుంటూ ,వాల్ల అమ్మ,నాన్నా లకు అన్నింటిలో సహకరిస్తు ఉండేది. తను చదువుకునే పాఠశాలలో మంచిగా అన్నింటిలో ఉపాధ్యాయులు ఉండేవారు. పాఠశాలలో ఎన్నో "కార్యకళాపాలు" జరుగుతున్నప్పుడు ఆ ఉపాధ్యాయులకు తెలిసిన ఎంతో "పెద్ద పెద్ద" వ్యక్తులను పాఠశాలకు "ఆహ్వానించేవారు". ఆ పెద్ద వ్యక్తుల ముందట ఈ "అక్షర" అనే అమ్మాయి యొక్క ప్రతిభను వల్ల ముందు కనబరిచేవారు. అలా వాల్ల ఉపాధ్యాయులు ఆ అమ్మాయిని అన్నింటిలో ప్రోత్సహిస్థూ  ముందడుగు నడిపించారు. చధువును' కష్టంగా కాకుండా ఇష్టంగా భావిస్తూ " అలా ఆ అమ్మాయి పై చదువులు చదువుతూ అన్నింటిలో మొదటి స్థానంలో నిలుస్తూ . ఇటు గ్రామానికి ,పాఠశాలకు ,మంచి పేరు ప్రఖ్యాతలను తెచింది. వాల్ల అమ్మ ,నాన్నలకి మరియు ఉపాద్యాయులు గర్వపడేలా చేసింది .  
నీతి : ఎప్పుడైనా మంచి మర్యాదలతో, సంస్కారం తో ఉంటే మరియు చదువుని ఇష్టంగా భావిస్తే ఎక్కడైనా గౌరవం పొందుతారు .
"మంచి పాఠశాల మంచి భవిష్యత్తుకి పునాది"
కామెంట్‌లు