*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౦౦ - 100)

 మత్తేభము:
*చెడుగుల్ కొందరకూడిచేయగ పనుల్ | చీకట్లు దూరంగ బా*
*ల్పడితింగాన గ్రహింపరాని నినునొ |  ల్లంజాల బొమ్మంచు ని*
*ల్వెడలం ద్రోచిన జూరుపట్టుకొని నే | వ్రేలాడుదుంగోర్కి గో*
*రెడి యర్థంబులు నాకు నేలయిడవో |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 నేను చెడు లక్షణాలు వున్న వారితో కలసి, చీకటిలో తిరుగుతూ చెడ్డ పనులు చాలా చేసాను.  మా అమ్మా నాన్నలు నన్ను ఇంటిలో వుండడానికి పని రాను అని చీదరించుకుని ఇంట్లో నుండి పంపించివేసారు.  నన్ను తరిమి కొట్టారు. కానీ నేను గబ్బిలం లాగా చూరు పట్టుకుని వేలాడుతూ అక్కడే వున్నాను. అలాగే, నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నా కూడా ఇంకా నామీద నీకు దయ రావటల్లేదు, ఎందుచెతో. నా పాపం పండలేదేమో.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మహానుభావా మాహేశ్వరా! ఈ ఐహిక ప్రపంచంలో నేను చేయని తప్పు లేదు. తిరగని చెడు తిరుగుడు లేదు.  వేమా రెడ్డిని వేమనగా చేసిన నీవు, నా తప్పులు కాయలేవా, కారుణ్యనిథీ. చెడు తిరుగుళ్ళు తిరిగిన పాడురంగని నీ భక్తుని చేసి మోక్షము ఇచ్చావు కదా, నాకలోక రక్షకా. మరి నీ గురించీ ఏమీ తెలియక నేను చేసిన తప్పులు, పాపాల నుండి నన్ను కాపాడలేవా, కరుణామూర్తి.  నీ కరుణ కురిసే వరకూ, ఎంత కాలమైనా, గబ్బిలం లాగా నీ చూరు పట్టుకునే వుంటాను. నాకు, నీవు తప్ప దిక్కు లేదు. "అన్యథా శరణం నాస్తి! త్వమేవ శరణం మమ! రక్ష రక్ష మహేశ్వరా! తక్ష రక్ష జనార్దనా!"*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు