మత్తేభము:
*జలజశ్రీగల మంచినీళ్ళుగలవే | చట్రాతిలో? బాపురే!*
*వెలివాడ న్మరిబాపనిల్లుకలదా? | వేసాలుగా కక్కటా*
*నలి నా రెండు గుణంబులెంచి మదిలో | నన్నేమి రోయంగా ఏ*
*చెలువంబైన గుణంబు లెంచుకొనవే | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
బండరాళ్ళ మధ్య పద్మం పువ్వు కనిపిస్తే, అక్కడ నీటి చెరువు వుండదు కదా. అలాగే, తక్కువ జాతి వారు వుండే వీధిలో మడి, శుచి పాటించే బ్రాహ్మణుల ఇల్లు వుండదు కదా. ఈ రెండు విషయాలు నీకు తెలిసి కూడా నిన్నే నమ్మి వున్న నా మనస్సులో తప్పుడు ఆలోచనులు వస్తాయి అని నీవు అనుకొని నన్ను, నీ నుంచి దూరం చేయకు. నీ ఆలోచనలలో నా స్థానం పదిలంగా వుండనివ్వు, దేవా .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి