*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧౨ - 112)

 మత్తేభము:
*క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుడు వ | చ్చెన్, మిమ్ములంజూడగా*
*నతడో మేటికవిత్వ వైఖరిని స | ద్యః కావ్య నిర్మాత, త*
*త్ప్రతిభల్మంచివి, తిట్టుపద్యములు చె | ప్పండాతడైనన్, మముం*
*క్రితమే చూచెను బొమ్మటందు రథముల్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
ఓ మహారాజా! మిమ్మల్ని చూడడానికి ఒక పెద్ద కవి వచ్చాడు. ఆయన మంచివి, పెద్దవి అయిన ఎన్నో కవితలను రాశారు.  తిట్టు కవిత్వం కూడా రాయగల మంచి కవి.  అతనిని  చూడటానికి మీరు ఇష్ట పడతారా? లోపలకు పంపించమంటారా, అని వాకిలి దగ్గర కాపలా వాడు అడిగాడు. అప్పుడు ఆ మహారాజు గారు, "ఆఁ ! ఈ కవి ఇంతకు ముందు వచ్చిన వాడే లే. ఇప్పుడు మళ్ళీ ఆ కవిని కలవ వలసిన అవసరం లేదులే.!" అని అన్నాడు.  ఇటువంటి రాజుల దగ్గరకు వెళితే ఏంటి వెళ్ళక పోతే ఏంటి....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మనుషులు నివసించి, తోటి మనుషలతో పాలింపబడుతూ, వుండే ఈ భూమి మీద మనుష్య రూపంలో వున్న రాజులను కొంత మంది సత్ప్రజలు వారి వారి కళా సంపదతో మెప్పించాలని అనుకుంటారు.  కానీ, ఆ రాజులు కూడా మానవులే కదా.  ఈ రాజులలో కామ,  క్రోధ, మద, మత్సరాలను జయించిన వారు, చాలా కొద్ది మంది. మిగిలిన అందరూ, ఎప్పుడో ఒకప్పుడు పక్షపాత వైఖరి అవలంబించిన వారే.  మరి వీరి మస్తిష్కానికి కళాసౌరభాలు ఎక్కుతాయా.  అయినా, కువిమర్శ చేసినా కిక్కరు మనకుండా ఆ విమర్శలను విని ఆహ్లాదకరమైన శబ్దాలుగా ఆస్వాదిచి మిమ్మల్ని తన అక్కున చేర్చుకునే సదాశివుడు సదా మీకు అందుబాటులో వున్నాడు కదా! మనమందరం  ఆ వ్యుప్తకేశుని, కపర్థిని ముప్పూటలా కడవల కొద్దీ గంగమ్మను తెచ్చి గరళకంఠునికి గంగ స్నానం చేయిద్దాము.  చేపలూ, కప్పలు "ఎంగిలి, ఎంగిలి" అంటుటాయి, కానీ,  మనం, మన బోళాశంకరునికి స్నానం చేయంచెద్దాం. ఆ జల చరాలకు కూడా మన పంక్తిలో పుణ్యాన్ని పంచుదాము.  మంచుకొండ అధినాథుడు కాదనుడు, కదా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు