"కవికోకిల డా.గుఱ్ఱంజాషువా గారి 126 వ జయంతి-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
తే.గీ.
పేదబలహీనవర్గాలగాధలెన్నొ
రచనలందునజొప్పించిరమ్యముగను
నంటరానితనమ్మునునవనిపైన
రూపుమాపియుకృషిసల్పెఋషివరుండు!!!
02.
తే.గీ.
కరుణతోడనునాతండుకలముబట్టి
ఆర్తి,యావేదనమ్ములేయస్త్రములుగ
పట్టిపోరాడిగెలిచినగట్టిపిడుగు
తెలుగుసాహిత్యలోకానవెలుగుపంచె!!!
03.
తే.గీ.
దమ్ముజూపించిమేల్కవిత్వమ్ము వ్రాసి
శారదామాతమెడలోనహారమేసి
తళుకుమనియెడు,కావ్యరత్నాలపంట
లందజేసెనుప్రతిభతోసుందరముగ!!!
04.
తే.గీ.
వ్రాసినట్టికావ్యాలన్నివాసికెక్కి
నవయుగమునకాదర్శమైనాందిగాను
వారికీర్తినిచాటించెవసుధయందు
జాషువాకవిసుకవియైచరితనిల్చె!!!
05.
ఉ.
శోకముబాపగన్ కలముసుందరమొప్పగపట్టెనాడు ; యీ
లోకముమెచ్చుకావ్యములురూఢిగవ్రాసెనుచిత్తశుద్ధితో
మాకిలపద్యతీర్థమును మాన్యతమీరగనందజేయుచున్
శ్రీ "కవికోకిలై"బిరుదు చేకొనెముద్దుగ"జాషువా"! కవీ!!!
06.
ఉ.
అబ్బురమొందగన్భువినియల్లితివీగిజిగాడుగూడునే
గబ్బిలకావ్యమున్ సృజన కమ్రపురీతిని చేసినట్టి మీ
నిబ్బరభావజాలుజన నీతినిచాటగనీశుచెంతకున్
గొబ్బునచేరవేసితివి?కూర్మిగనార్తినిచాటిచెప్పగన్!!!కామెంట్‌లు