గుర్రం జాషువా126వ జయంతి సందర్భంగా పద్యాలు ప్రత్యేకం.--కటుకం రాజయ్యకలంపేరు:సంఘమిత్ర--చరవాణి సంఖ్య:9441560232

సీ:గుంటూరు జిల్లాన గుర్రము వంశాన
    పుట్టెను జాషువా పుడమిపైన
    తల్లిలింగమ్మల తండ్రి వీరయ్యల
     తగినతనయుడంటు తలిచె జనము
     మిస్సమ్మ తోటలో మిక్కిలి వెలుగొంది
     ‌వినుకొండలో జద్వి విజ్ఞుడయ్యె
     కులరక్కసిలగోడు కుంపటై చెలరేగ
     యవమానములునెన్నొ యనుభవించె!!

తేగీ:కలము చేతను బట్టియు కవితలల్లి
       దళిత బహుజన జనులకు దారిజూపి
       రచన పిరదౌసి గబ్బిలం రాగ మెత్తి
      కులము కుళ్ళును కూల్చేయ గళమునెత్తి
‌     విశ్వ నరుడును తానయ్యి వినుతికెక్కె!!

కం:కవికోకిల బిరుదులతో
   ‌‌‌   రవివలెవెలుగొందె నాడు రాజ్యము నందున్
    కవిజాషువ రచనలతో
    భవిషత్తుకు వెలుగుజూపె బాధలు దొలగన్!!

కామెంట్‌లు