సూక్తులు--జ్ఞానం – 2--సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414, peddissrgnt@gmail.com

 @ జ్ఞానం నిరంతర ఆనందదాయని, కీర్తిని ఇస్తుంది.  స్ధలంలో/కాలంలో అనంతమైనది.డ్యూయిట్ క్లింటన్
@ జ్ఞానం పెరిగేకొద్దీ మన అజ్ఞానం ఎంతో తెలిసి వస్తుంటుంది. షెల్లీ
@ జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం.
@ జ్ఞానం వలె సుఖకరమైనది వేరేదీ లేదు.
@ జ్ఞానం విస్తరించాలంటే పాఠశాల చదువు, అక్షరాస్యతా  రెండూ కావాలి.  అంబేద్కర్
@ జ్ఞానం వున్నచోట శక్తి వుంటుంది,  తెలివి వున్నచోట వెలుగు వుంటుంది. 
@ జ్ఞానం సర్వోత్తమ వరప్రసాదం. 
@ జ్ఞానం, సంభాషణా చాతుర్యం, దానం,  నేర్చుకుంటే గాని అలవడని సద్గుణాలు. జాన్సన్
@ జ్ఞానవిలువలు, అజ్ఞానదోషాలు బౌద్ధం నొక్కి చెప్పింది.  కళ్ళు తెరచి వుండమని ఇంకే మతం చెప్పలేదు.
@ జ్ఞాపకం, ఆలోచన జ్ఞానాన్ని పెంచుతాయి.
@ తన గమ్యాన్ని గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. జిడ్డు కృష్ణమూర్తి
@ తమ అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. సర్వేపల్లి  రాధాకృష్ణన్
@ తెలిసిన జ్ఞానం నుండి తెలియని జ్ఞానాన్ని తెలుసుకోడానికి కృషి చేస్తుంది జీవితం.
@ దాచిన జ్ఞానం నిరుపయోగం, ప్రజలను పీడించడానికి సాధనమౌతుంది. కొడవటిగంటి 
@ దానాలు అన్నిటిలో వేదజ్ఞానదానం ఎక్కువ శ్రేష్టమైనది. మనుస్మృతి
@ నాగరకత ఒకరినుండి మరొకరికి వ్యాపించే జ్ఞానం. ఆర్. ఆర్. మారేట్
@ నాది-   త్యజిస్తే చిత్తశుద్ది కలుగుతుంది.‘నేను’ ను త్యజిస్తే జ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి

కామెంట్‌లు