గురువు2-సాహితీసింధు సరళగున్నాల
మ*వదలన్బూనక పట్టినేర్పు 
చదువుల్ భారంబుగాదోచకన్
సదయాత్ముండుగనెప్పుడుండు
విడకన్ సంతోషముప్పొంగగన్
బదలాయింపునుజేయుచుండు
తెలివిన్ వాదమ్ముకైనేగకన్
ముదమారంగనుజ్ఞానమిచ్చు
గురువున్మోదంబుతోమోక్కుమా

తే.గీ*విద్యయున్నంతనేమి వివేకమున్న
జ్ఞానమందించుగురువుల జ్ఞప్తివిడక
బ్రతుకుత్రోవలునేర్పగా భాగ్యమనుచు
విడువబోకుమునొజ్జల ప్రీతిగొనుచు

తే.గీ*ఎంతచదివిన ఫలితమ్మునేల గలదు
గురువుమానసమెరుగకన్ కొలదినైన
ఆడుమాటలుపరుషంపు నాలకింప
గురుతుగొనలేరు నెవ్వరు కులములోన


కామెంట్‌లు