సూక్తులు--జ్ఞానం – 3--సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414, peddissrgnt@gmail.com

 @నీ ఆభరణం రూపం. రూపానికి గుణం,   గుణానికి జ్ఞానం, జ్ఞానానికి క్షమ ఆభరణాలు. 
@నూతనంగా అన్వేషించే జ్ఞానం ఏదైనా గణిత రూపంలో వుంటుంది. పి. జి.డార్విన్
@నేను, నాది అజ్ఞానం,  నువ్వు నీది జ్ఞానం.
@పంచే కొలది జ్ఞానం పెరుగుతుంది, సంపద తరుగుతుంది. ఆలీ అబ్ తలీబ్
@పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం ముఖ్యం.
@బాగా అడిగిన ప్రశ్న జ్ఞానంలో సగభాగం. ఎక్కువప్రశ్నిస్తే ఎక్కువ జ్ఞానం సంపాదిస్తారు.ఫ్రాన్సిస్ బేకన్
@మతాలన్నీ మాసిపోతే జ్ఞానం నిలిచి వెలుగుతుంది, స్వర్గసుఖాలు అవనిలో విలసిల్లుతాయి. గురజాడ
@లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం ఎంత ఉన్నా నిరుపయోగమే. నెహ్రూ
@వచ్చినా వదిలి పోనివి,  కీర్తి,  జ్ఞానం,  విద్య. వచ్చేవి పోయేవి  పేదరికం,  వ్యాధి,  డబ్బు. 
@వస్తుఉత్పత్తి పెరిగేకొలది ఆదాయం తరుగుతుంది. జ్ఞానం అలాకాదు. జె.యం.క్లార్క్
@సంతృప్తి చెందటం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవటం అజ్ఞానం.
@సంపాదించిన జ్ఞానం ఎప్పటికైనా పనికివస్తుంది.
@సత్యం,  జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పులు మనిషికి నిజ బంధువులు. చాణక్య
@సత్యమే జ్ఞానం, ఈశ్వరుడు, ధర్మం, న్యాయం,సర్వం.   సత్యంపైన ప్రపంచమంతా నిలచి వుంది. 
@ సముచిత ప్రశ్నను అడగడం నేర్చిన వ్యక్తికి సగం జ్ఞానం ఉన్నట్లే.  ఫ్రాన్సిస్ బేకన్

కామెంట్‌లు