బాల గీతం.:-బంగారు రామాచారి-విశ్రాంత ఉద్యోగికోదాడ.508 206సెల్.9949391110.
విరబూసిన మందారాలు
వికసించిన మరు మల్లెలు
నేటి చిన్నారి బాలలు
నేటి వన్నెల మాలలు

రేపటి మన జాతి నేతలు
భారత మాత ఆశాజ్యోతులు
మేలిమి జానపద గీతాలు
కలకాలం ప్రకాశించే మణిదీపాలు


అన్నెం పున్నెం ఎరుగని అపరంజి రూపాలు
బాలలు మిలమిల మెరిసే రవ్వలు
కల కలలాడే కల్హారపు పువ్వులు
కలకాలం వాడని తెలిచిరునవ్వులు 
బాలాలందరికి కలిగించాలి సంక్షేమం
బాలాలందరూ పొందాలి నవోల్లాసం
నాడు సమాజానికి కలుగుతుంది సౌభాగ్యం.


కామెంట్‌లు