"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు--సిద్ధిపేట--చరవాణి :- 6300474467

 "సరస్వతీపుత్రపుట్టపర్తినారాయణాచార్యులు-పద్యాంజలి"!!!

01.
తే.గీ.
భువిఅనంతపురములోనపుట్టినట్టి
పుట్టపర్తినారాయణుదిట్టకవిగ
పేరుప్రఖ్యాతులొందినప్రేమమూర్తి
"తెలుగుభాషామతల్లికితిలకమితడు"!!!

02.
తే.గీ.
వ్రాసెరచనలనెన్నియోవైభవముగ
"అందు"శివతాండవము"గొప్పయద్భుతమ్ము"
తానుదీనినిస్వయముగాగానమున్ను
చేసిపాఠకహృదయాలుసేదదీర్చె!!!

03.
తే.గీ.
"పెక్కుభాషలుమాట్లాడిమక్కువగను"
పాండితినిసమకూర్చినపండితుండు
ఆధునికకవిలోకానయగ్రగణ్యు
డుగవెలిగెనుగాదెయతడునిగనిగముగ!!!

04.
తే.గీ.
"భారతీదేవిముద్దులపట్టియయ్యి"
"సరససంగీతసాహిత్యవరములన్ని"
"పొంది,విలువొందికీర్తినియందినట్టి"
"పుట్టపర్తియేతెలుగులపుణ్యపేటి"!!!

05.
తే.గీ.
అనువదించెనుకావ్యాలునందముగను
భాషగరిమనుపెంచినప్రాజ్ఞుడితడు
సాహితీశిఖరుడిగతాసాగినట్టి
"సద్వివేకినారాయణశక్తియుతుడు"!!!


కామెంట్‌లు