"వినాయకచవితిపండుగ-నవపద్యాంజలి!!!":-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
గణపతినిన్నేనమ్మితి!
క్షణక్షణమునభజనజేతుక్షమియింపుమయా!
ప్రణతులుగైకొనిస్వామీ!
గణనాయకవిఘ్నములనుకడతేర్చుమయా!!!
02.
కం.
వరసిద్ధివినాయకుడా!
నిరతమునినునమ్మికొలుతు,నీవేనన్నున్!
సరిగాకాచెడితండ్రివి!
వరములనెన్నియొనొసంగుప్రార్థింతుమదిన్!!!
03.
 కం.
శ్రీకరమగుమీరూపము!
నేకాలముకైనగానినెంతోశుభమున్!
చేకూర్చుచుండుగణపతి!
శోకము,కష్టములబాపిసుఖములనిమ్మా!!!
04.
కం.
శ్రీవరసిద్ధివినాయక!
రావాకరుణాంతరంగరయముగభువికిన్
దేవా!"కరోన"ద్రుంచియు
త్రోవనుజూపించిమాకుతోడ్పడవయ్యా!!!
05.
కం.
"దండమయాగణనాథా!"
"దండమయాయేకదంతదయజూపవదే!"
"దండమయాగజముఖుడా!"
దండమయాదండముతొలిదైవమునీవే!!!
06.
ఆ.వె.
"ప్రథమపూజలందుపరమేశుతనయుడు"
"బొజ్జగణపతికినిబుద్ధిదీర"
"చవితిరోజునాడుశ్రద్ధతోభక్తులు"
"పాయసమునుబెట్టుభవ్యముగను"!!!
07.
ఆ.వె.
ఎలుకవాహనంబునెక్కుచులోకాల
దిరుగుచున్నదొరవుపరమయోగి
విఘ్నములనుబాపివిజయంబుచేకూర్చు
విఘ్నదేవమిమ్మువిడువమయ్య!!!
08.
ఆ.వె.
పత్రిపూలతోడపతితపావనుడైన
విఘ్ననాయకుడినివేడుకొనిన
సకలసంపదలనుశాంతి,ముక్తియునిచ్చి
దినదినాభివృద్ధిదీవెనొసగు!!!
09.
సీ.
విఘ్నాలదొలగించవెలసినట్టిగణేశ
అందుకోగణపయ్యఆదిపూజ
మోదకంబులతోడమోదంబుతోడను
దీవించుమోదేవదేవనాథ
పార్వతీప్రియపుత్రపాపనాశకయీశ
ఎలుకవాహనమెక్కియేలుదేవ
కోరినభక్తులకోర్కెలుదీర్చంగ
కరుణించిభక్తులవరములివ్వు
(తే.గీ.)
భజనసేయగమాలోనభక్తినిలుపు
శుభము,విజయాలనందించుసుందరముగ
విద్యబుద్ధులునేర్పించివిధిగమాకు
మోక్షమార్గాన్నిజూపించుమోదమలర!!!కామెంట్‌లు