"హరితవిప్లవపితామహుడు నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ గారికిపద్యాంజలి"!!!"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
"ఆహారపంటలకొరత"
"సాహోయనిదీర్చినట్టిశాస్త్రజ్ఞుండున్"
"జోహారనిబోర్లాగుకు"
"ఓహోయనినతులుసలిపెనుర్వినిజనులున్"!!!

02.
కం.
"గోధుమపంటలదిగుబడి"
"శోధనతోజరిపిజనులశోకముబాపెన్"
"సాధనతోవిజయంబును"
"ప్రాధాన్యతతోడనొందెప్రాజ్ఞుడుబోర్లాగ్"!!!

03.
తే.గీ.
"కోట్లజనులయాకలిదీర్చికోర్కెదీర"
"శాస్త్రపరిశోధనలుజేసిసచ్చరితుడు"
"వంగడాలుగోధుమలతోఫలితమొంది"
"హరితవిప్లవపితగానుఅవనివెలిగె"!!!

04.
తే.గీ.
"ఇతనికృషికినోబెల్ శాంతినిచ్చిగౌర"
"వించి,సత్కారమందించివిశ్వమందు"
"కీర్తిపెంచిరి,మానవమూర్తియనుచు"
"సతముకొనియాడుచుందురుసముచితముగ"!!!
కామెంట్‌లు