"మనసుకవిఆత్రేయగారికిపద్యాంజలి"!!!:"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
తే.గీ.
"కృష్ణమాచార్యసీతమ్మకూర్మిసుతుడు"
"మంగళంపాడుగ్రామపుమహితశాలి"
"తెలుగుసాహితీలోకపుజిలుగుతాను"
"శ్రేష్ఠుడాత్రేయకవిమీకుచేతునతులు"!!!

02.
తే.గీ.
"చిన్నిచిన్నిపదాలతోచిత్రగతిని"
"భావరసమాధురులనెన్నొపాఠకులకు"
"అందజేసియుపరమార్థమందజేసి"         
"తెలుగువిభవమ్మునిదియనిదిశలచాటె"!!!!

03.
తే.గీ.
"మధ్యతరగతివారలబాధ్యతలను"
"సృజనగావించితెరపైకిజూపినట్టి"
"గొప్పవేదాంతియాతండుకోవిదుండు"
"భారతీమాతగన్నట్టిభాగ్యఫలము"!!!

04.
తే.గీ.
"పాటలును,నాటకాలనుప్రతిభతోడ"
"వ్రాసి,వాసిగాంచెనుగాదెభవ్యమలర"
"మనసుకవిగానుఆత్రేయమహినివెల్గి"
"చిత్రసీమనునేలెనుచేవతోడ"!!!కామెంట్‌లు