"స్నేహబంధము-సీసపద్యము!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467

 సీ.
కష్టసుఖములందుకలిమిలేములయందు
వీడనట్టి"చెలిమి"ప్రీతికరము
ఆపదవేళలోయానందసమయాన
భాగ్యమయ్యెడి"దోస్తి"పరమశుభము
తనపరభేదముదలచకనెప్పుడు
మసలెడి"స్నేహమే"మధురగుణము
కడురహస్యములనుకచ్చితముగదాచి
నిర్మలత్వముజూపు"నెయ్యమెపుడు"
(తే.గీ.)
దివ్య"కృష్ణకుచేలుల"తీపిమైత్రి
మార్గదర్శనమైవెల్గిమమతపంచి
రాగబంధమైయలరారిరహినిగూర్చి
అమల"మిత్రుత్వ"మెప్పుడునవనివెలుగు!!!కామెంట్‌లు