"పల్లెటూరుగొప్పదనము-సీసపద్యము"!!!"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 సీ.
సుప్రభాతమువేళసూర్యోదయపుకాంతి
పసిడివర్ణపుశోభమిసిమిగొల్పు
హరితశోభతరులుపరిమళించువిరులు
పికశుకరవములుప్రీతిగొల్పు
ఎలనాగయెదలోనఎలదేటినాదాలు
ప్రియుడితలపులందుప్రేమగురియ
కర్షకవర్యులకలలన్నినిజమయ్యి
పంటలెన్నొనిచటపండుచుండు
మమతానురాగాలుసమరసభావాలు
కురిపించిమురిపించికూర్మిపెంచు
(ఆ.వె.)
ఆవకాయపెరుగునావేడిఅన్నము
కొసరితల్లిబెట్టుగోరుముద్ద
తనివిదీరదెపుడుతపనచెందునుగాదె
అమ్మచేతివంటకమ్మదనము!!!
02.
ఆ.వె.
ఆపదసమయానఅందరునొకటిగా
చెంతనిల్చియుండిసేదదీర్చి
సకలసేవసలిపిసంతసమునుగూర్చు
పల్లెతల్లిమనసుమల్లెసొగసు!!!కామెంట్‌లు