"ప్రపంచపేపరుబాయ్ లదినోత్సవము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేట-చరవాణి :- 6300474467

 01.
తే.గీ.
"తెల్లవారకముందరేతేజముగను"
"బస్సులాగెడిచోటుకుబయలుదేరి"
"కట్టలుగనున్నపేపరుకట్టలన్ని"
"తీసియొక్కక్కటిగపేర్చితీరుగాను"!!!
02.
తే.గీ.
"సైకిలునుత్రొక్కిరయముగాసాగిముందు"
"వార్తపత్రికలనుదెచ్చిప్రతిదినంబు"
"ఇంటిగేటుముందరపెట్టియింపుగాను"
"వార్తపత్రికలనుపంచుబాలుడతడు"!!!
03.
తే.గీ.
"పేదరికముచేతనుతాను పేపరులను"
"వేసి,గొప్పచదువరిగాపేరువడసి"
"భరతదేశరాష్ట్రపతిగాపరిఢవిల్లి"
"సేవజేసెనబ్దుల్కలాంపావనముగ"!!!


కామెంట్‌లు