"భారతీయవైభవము":-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
(సీసమాలిక)
కళలకాణాచియైఘనకీర్తులందియు
నాటపట్టుగనుండెనవనిపైన
యితిహాసధర్మాలనింపుగాపాటించి
రాజ్యపాలనజేసెరాజులపుడు
సాంప్రదాయాచారసంపత్తిగలిగుండి
భిన్నసంస్కృతులకుపేరునొంది
వేదప్రబోధమ్మువిశ్వాంతరాలమై
యెలుగెత్తిచాటించివెలుగుపంచి
పరమతసహనమ్ముభాసురమైయొప్పి
నీతిశాస్త్రములకునెలవునయ్యె
పుణ్యనదులచేతపులకించెనీభూమి
పైరుపంటలసిరిభాగ్యమబ్బె
(ఆ.వె.)
"స్వర్గసీమగాదెసన్నుతిభారతి"
నిన్నుగొలుతునెపుడునెమ్మనమున
శాంతి,సహనములకుచక్కనిచిరునామ
వీరసుతులగన్నధీరవనిత!!!


కామెంట్‌లు