సంతృప్తే మిన్న(చిత్రకవిత):-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464


అర్దశతాబ్ద వైవాహిక బంధానికి
అల్లుకున్న ప్రేమ పొదరింటి దాంపత్యం
కటిక పేదరికంలోను ఓడిపోని అన్యోన్యత

పూరిగుడిసెలోని ప్రేమాప్యాయతలముందు
చిన్నబోయిన అద్దాలమేడ హంగులు

వృద్దాప్య సమస్యల వలయం
పూట గడవక ఉక్కిరి బిక్కిరి
పెనిమిటి తోడే జీవిత చుక్కాని

రెక్కలొచ్చి ఎగురిపోయిన పేగుబంధాలు
పండుటాకులనొదిలిపోయే కనికరంలేక
మూగప్రాణులే మచ్చికాయేను మనసుకు

ఆశలతో సంతోషాలు ఆవిరికాకుండా
సంతృప్తే స్వర్గమనుకున్నారు
పంచభక్ష పరమాన్నాలు కోరకుండా


కామెంట్‌లు