*ముత్యాల హారాలు*( చిన్ని కృష్ణునికి):-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

 
321.
దేవకి నందన సుతుడు
యశోధమ్మ  మురిపాలుడు
నవనీత చోరుడు వాడు
రేపల్లె ముద్దు బాలుడు
322.
యశోధమ్మ పెంపకము
ఇల్లాంతా మురిపెను
జగమంతా సంతోషము
మా మదిలో ఆనందము
323.
శిరమున నెమలి పింఛము
గోపికల పరవశము
సయ్యాటల వయ్యారము
నయనానందకరము
324.
చిన్ని చిన్ని కృష్ణయ్య
మా హృదిలో నిలవయ్య
మాయను తొలగించయ్య
ముద్దులొలుకు కన్నయ్య
325.
ప్రేమాప్యాయతల బాలుడు
బృందావన పరిపాలుడు
అవతారా పురుషుడు
మానవాళి ఆరాదుడు

కామెంట్‌లు