తీర్చలేని రుణం:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464
ప్రేమానురాగాల లతలల్లుకున్న బంధం
ఆలమగల అన్యోన్య సంబంధం

కన్నబిడ్డల ఆకలి కోసం పస్తులుంటూ
ప్రయోజకులను చేసిన ప్రేమ మూర్థులు

మలమూత్రాదులెత్తి నైర్మల్యపు 
కాంతినిచ్చిన అమృతమూర్తులు

వృద్దాప్యము ఒంటినలుముకున్నా
సడలని ఆత్మస్తైర్యoతో సాగుతూ

వైవాహిక వంతెనపై పయనిస్తున్న
పండుటాకుల మమతల బాంధవ్యం

రెక్కలొచ్చిన పిల్లలు తలోదారి పట్టగా
చేతికర్ర సాయమే నడిపించే బతుకు పోరులో

ఒకరికొకరమై నావ తీరం చేరగా
జీవిత చరమాంకంలో ఎవరినీ నిందించక

జవసత్వాలుడిగిన చివరి దశలో
చీదరింపులు ఛీత్కారాలు శరామామూలేకామెంట్‌లు