చక్కదనపు చుక్క(డాటర్స్ డే స్పెషల్)- చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

చిరునవ్వులు చిందిస్తూ
హరివిల్లై విరిసెను పాపాయి.

పున్నమినాటి జాబిల్లై
మా ఇంట వెలుగు నింపేవు.

నింగిలోని తారామణిలా
మా ఇంట నడయాడే దేవత.

మమతల తోటలో విరబూసిన
మల్లెల పరిమళం మా పాపా.

ఇలకు వేంచేసిన చక్కదనాల
చక్కని చుక్క మా చిన్ని.

ముత్యాల మాటలతో
మనసు దోచే మహారాణి.

పట్టులంగా తొడిగిన పసిడిబాల
కొప్పున పూలెట్టిన పుత్తడిబొమ్మ

అందెల రవళితో ఇల్లాంతా
కలయతిరుగాడే గారాలపట్టి.

ఆడపిల్లలు ఉన్న ఇల్లు
మమతల పొదరిల్లు.


కామెంట్‌లు