భక్తుల పాలిట ఆపద్బాంధవ
అందుకో గణపయ్య ఆదిపూజలు
చల్లగ బ్రోవుము సిద్ధి వినాయక
ఆకులు పూలతో అలంకారమై
పండ్లు పాయస పరమాన్నాలు
గైకొనుమయ్యా విఘ్నవినాయక
ఇష్టదైవమై ఎదలో నిలువుము
గజముఖ సుందర గణనాథా
లొంబోధరా..ముక్తి ప్రదాతా
విఘ్నాలు తొలగించి విద్యలనివ్వు
వైరసులు రాకుండా రక్షించవయ్యా
మట్టి గణపతిని ప్రీతిగ చేసి
నిర్మల మనసుతో పూజలు చేసి
మంచి నీటిలో కలుపుదము
పర్యావరణం రక్షించుదము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి