తొలకరి చినుకుతో.. ఉద్యుక్తుడవై
హలము దున్ని.. దేశానికి బువ్వపెట్టు రైతన్న..
పంటనే నమ్మి పస్తులున్నవు..
గానీ మోసమంటూ ఎరుగని.. మహానీయుడవు..
సాలుసాలులో సంతోషం వెతుక్కుంటూ..
విత్తులోని శక్తినంతా కూడదీసుకొని ఏపుగా పెరిగిన
పచ్చని పంటను చూసి
కనువిందు చేసుకొని..
పచ్చడి మెతుకులతో..
సగం ఆకలి తీర్చుకున్నావు..
పొలమునే నమ్ముకొని..
ఆరుగాలం కష్టించి పండే
పంటలో..ప్రతి గింజలో నీ
చెమట బొట్టుంది..
తినే ప్రతి ముద్దలో రక్తం చుక్క ఉంది..
ఎండకు ఎండుతూ వానకు
నానుతూ..
పిల్లాజెల్లతోటి పొలం చేతలోనే కుస్తీ పడుతూ..
అర్ధరాత్రి అపరాత్రి నిద్రలు
మాని చేను కాపలా కాస్తూ..
విషపురుగులతో సాహసం చేస్తూ..
బుక్కెడు బువ్వతో కష్టాన్ని
మరిచిపోయి నిరంతరం శ్రమలో
లీనమయ్యే అన్నదాత ..
నీకు జోహార్లు..
అకాల వర్షాలు వడగళ్ల..
గిట్టుబాటు ధర లేక..
దళారుల చేతిలో మోసపోతూ
గంపెడు ఆశలను చంపుకొని
పుట్టెడు దుఃఖంలో..
అప్పుల ఊబిలో కూరుకు పోయే
అన్నదాత నీకు వందనం..
ప్రభుత్వ తీరు మారి..
గిట్టుబాటు ధర కల్పించి.
రైతు బంధు పథకమే కాదు..
రైతుకు జీవిత పింఛను
ఇవ్వాలి..
రైతుల దగ్గర దళారీల
వేశాలు మారాలి..
ప్రజలు కొసరి కొసరి
బేరమాడే తీరు మారాలి..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి