చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

అమ్మా నీవు లేకున్నా..

అమ్మా నీవు లేకున్నానీ జ్ఞాపకాలతో
నీ తీయని ఉహాలకు నే సాక్షమైనాను
నీ కలలకు నే సాకారమైనాను
నీ ఆశయాలను సిద్ధిపచేసాను.

ఇన్ని సం.లు గడిచినా నాకు
నిన్న మొన్నలాగే ఉన్నది నీ ఎడబాటు
నా జన్మకోసం నీ తపన
నీసహనం దేవతను తలపించాయి.

సృష్టికే ప్రతి సృష్టి నీవు
అమ్మతనం కోసం అనునిత్యం
బాధలన్ని మరచి పునర్జన్మనే ఎత్తావు
మంచల్లే కరుగుతూ మా బతుకుదిద్దావు.

చిన్న గాయమైన తల్లడిల్లిపోవు
నీవు పస్తులుండి బిడ్డ కడుపునింపావు.
ఊరెళితే ఏదోలా అనిపించే మాకు
ఇన్నాళ్ళైనా రవేమమ్మా మాకోసం

బిడ్డల భవిత చూసి తల్లి
సంతసించు తన్మయత్వమందు
మరి మా జీబితాన్ని చూసి
సంబర పడేందుకు నీవు లేవు కదమ్మా..!


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Excellent 🙏