కలను ఎలా అక్షరీకరించను.మస్తిష్కం నిండా వెలుగు నింపి,
మూసుకున్న కళ్ళల్లో కాంతిని విరజిమ్మి
క్షణంలో మాయమవుతుంది.
ఒక రంగుల రాట్నం మనల్ని సుదూరాలకు
తీసుకువెళుతుంది.
హిమ పర్వతాలను తాకేలా చేస్తుంది.
తెల్లవారు జామున వచ్చే కల నిజమవుతుందనేది
నిజమో కాదో తెలియదు కానీ
లీలగా మనసును తాకి జలపాతమై సాగిపోతుంది.
రోజులో మనకు వచ్చే ఆలోచనలే రాత్రి కలల్లో మనల్ని
పలకరిస్తాయి.
వెలుగుల ప్రపంచంలో విహరింపజేస్తాయి
నిజంగా కలకు రూపం వుంటుందా...
వుంటుందేమో, దాన్ని అక్షరీకరించడం ఎవరికైనా
సాద్యమవుతుందా....
స్పష్టత లేని ముఖాలు, పరిచయం లేని స్థలాలు,
ప్రియమైన వ్యక్తుల కలయికలు...
ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కళ్ళ ముందు అద్బుత సినిమాను నిర్మిస్తాయి.
కొన్ని కలలు పూర్తిగా జ్ఞాపకం వుంటాయి, మరి కొన్ని
సగంలోనే అంతరించిపోతాయి.
కలలో కొన్ని విషాదాలు కూడా వుంటాయి
ఉలిక్కిపడి లేచి, గుర్తుకు రాని క్షణంతో కుస్తీలు
పడుతుంటాం.
కొన్ని బాహుబలి కోటలు కనబడుతాయి
మరొక్కసారి పాడుబడిన ఇళ్ళల్లో రాబందులు
దర్శనమిస్తాయి...
ప్రయత్నించా కలకు అక్షర రూపం ఇవ్వాలని కానీ
కష్టమే!
జరిగే సంఘటనలు, సంభాషణలు, చుట్టూ ఉన్న వ్యక్తులు...
జరిగీ జరగనట్లు, మాట్లాడి మాట్లాడనట్లు, నీకు
బాగా కావాల్సిన తోడు నీ పక్కనే వుంటుంది కానీ
మౌనంగా చూస్తుంటుంది....
ఒక్కొక్కసారి రోదిస్తుంది.....మరొకసారి నీ చేయి
పట్టుకొని తీసుకువెళుతుంది
ఆ తోడు ముఖం కాంతివంతం అయి ఉంటుంది
ఆ తరువాత మాయమయి పోతుంది.
మనం ఇలలో ఊహించనివి కలలో నిజమవుతాయి.
ఇక్కడే మనం ఎంత సోషల్ అయినా సైన్స్ ను
నమ్మక తప్పదు.
కల వాస్తవం కాదు....
మెదడు గదుల్లో గాఢంగా నాటుకుపోయిన సంఘటనలే
రాత్రి కలల్లో వెంటాడుతుంటాయి....
కల...:- ప్రమోద్ ఆవంచ-7013272452
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి