*అప్పుడే మార్పు*? :-*'రసస్రవంతి' 7075505464**'కావ్యసుధ' 9247313488*

మగాడు మృగమవుతున్నాడు 
కళ్ళకు కామపు పొరలు కప్పి
చిన్న పెద్దా తేడా లేదు
వావీ వరుసా అసలే లేదు
మనిషి మృగమవుతున్నాడు
కన్న తల్లిదండ్రులే బిడ్డలపై
లైంగిక దాడికి తెగబడ్డ తున్నారు
కన్నవాళ్లేకామాంధులవుతుంటే
దైవమా ఆడవారికి రక్షకు లేవ్వరు ?
మగాళ్ళు మృగాళ్ళయి
ఉన్మాదులుగా మారి
లైంగిక దాడులకు తెగబడు తుంటే 
పసి మొగ్గలను కిరాతకంగా
చిదిమేస్తుంటే 
ఆంబోతులా విచ్చలవిడిగా
తిరిగే ఈ మానవ మృగాలను?
పట్టి బంధించే కంటే
మానభంగం చేసిన వారిని
ఎన్ కౌంటర్ చేయండి
పిచ్చి కుక్కల్లా కాల్చి వేయండి 
ఉరిశిక్ష వెయ్యండి 
చట్టాలు మార్చేయండి 
ఉరిశిక్ష ఖరారు చేయండి
ఉరిశిక్ష శాసనం చేయండి 
అప్పుడే కామాందకుల్లో 
మార్పు తీర్పు అవుతుంది.

కామెంట్‌లు