01.
తే.గీ.
హిందుధర్మమ్మురక్షించుబంధువతడు
రామమందిరనిర్మాణరక్షయతడు
భరతదేశప్రధానియైవరలెనతడు
భువి"నరేంద్రమోడీ"సదాపూజ్యుడతడు!!!
02.
తే.గీ.
ప్రజలకుపయోగపడుపనుల్ పట్టువిడక
సలుపుచున్నట్టినిస్వార్థసాధువతడు
దేశక్షేమమ్ముకాంక్షించిదేశభక్తి
చాటుచుండినపరిపూర్ణసత్యశీలి!!!
03.
తే.గీ.
భరతమాతనుస్తుతియించిబాధ్యతగను
అన్నిరంగాలయభివృద్ధియవసరమని
మంత్రివర్గమ్ముతోతానుమంతనములు
ముదముతోడనుజరిపియుముందునడిచె!!!
04.
తే.గీ.
రాజనీతిజ్ఞుడైయుండిరాజ్యపాల
నమును,సముచితంబుగజేసినమ్మకముగ
దేశములమధ్యశాంతికైస్థిరముగాను
పరితపించెడిధీశాలిపరమయోగి!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి