:జయ జయ తెలంగాణ:- శిరీష వూటూరిసెల్ నెంబర్: 8008811669
జై తెలంగాణ అన్న
నినాదమే ఆయుధమై,
మాటలు  తూటాలై,
ఉద్యమం ఉరకలెత్తి
సాధించిన తెలంగాణ.........

బమ్మెర పోతన భాగవతమై,
రుద్రమ దేవి   పోరాటమై,
పీవీ నరసింహుని పదములలో
ప్రసిద్ధికెక్కిన తెలంగాణ.......

కాళోజీ   కమ్మని  కవిత్వమై,
యెములాడ రాజన్న రాజసమై
భాగ్యనగర శోభితమై
విలసిల్లిన  తెలంగాణ...

బతుకమ్మ గా  బతుకునిచ్చి,

సమ్మక్క సారలమ్మ జాతరగా,
జోరుమీదున్న  జానపదమై
ఖ్యాతి గాంచిన తెలంగాణ......

పాలపిట్ట పలుకులలో,
బోనాల పండుగ జాతరలో,
తెలుగువారి సంస్కృతిని
ఎల్లలు దాటించిన తెలంగాణ....

జయ జయ తెలంగాణ 
కోటి రతనాల వీణ ....

కామెంట్‌లు